భారత్ సమాచార్, రాజకీయం : ఉద్యమ కాలమైనా, పరిపాలనా ప్రస్థానమైనా… నిత్యం తెలంగాణనే శ్వాసించిన నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.
బీఆర్ఎస్ అధినేత, కేసీఆర్… నేటితో 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు వెల్లడించారు. ఈ సందర్భంగా 1000 మంది ఆటో డ్రైవర్లకు బీమా పత్రాలను అందించనున్నట్లు వారు తెలిపారు.

రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు 1954 ఫిబ్రవరి 17న హైదరాబాద్ రాష్ట్రం (ప్రస్తుత తెలంగాణ) లోని చింతమడక గ్రామంలో కేసీఆర్ జన్మించారు. ఆయనకు తొమ్మిది…





