భారత్ సమాచార్, హైదరాబాద్: ప్రముఖ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సివిల్ సర్వీస్ ఆశావహులు, యువతకు కెరీర్, జీవితం, వ్యక్తిగత ఎదుగుదలపై కీలక సూచనలు చేశారు. యూపీఎస్సీ పరీక్షల చుట్టూ ఉన్న ఒత్తిడి, అపోహలను తొలగించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది జీవితంలో ఒక ముఖ్యమైన దశ అయినప్పటికీ, దాని ఫలితాన్ని జీవితంలోని ఏకైక విజయంగా భావించకూడదని సూచించారు.

యూపీఎస్సీ కోసం పూర్తి స్థాయిలో కష్టపడి ప్రయత్నించిన తర్వాత, రెండు పూర్తి ప్రయత్నాల అనంతరం కూడా ఆశించిన ఫలితం రాకపోతే…