భారత్ సమాచార్, ఆధ్యాత్మికం ;

హిరణ్యకశిపుడు తపస్సుకి వెళ్లినప్పుడు నారదుని ఆశ్రమములో లీలవతికి కుమారుడు కలిగాడు. ప్రహ్లాదుడు అని పేరు పెట్టారు. ఇతరులు సంతోషిస్తే సంతోషించే వాడు ప్రహ్లాదుడు. తనకి ఉన్నది ఒకరికి పెట్టి వారు సంతోషిస్తే ప్రహ్లాదుడు సంతోషిస్తాడు. ఒకడు ఏడిస్తే చూచిసంతోషించి తానే అనుభవించి సంతోషిస్తాడు హిరణ్యకశిపుడు. లోకములో ఒక ధర్మము ఉన్నది. మంచి కొడుకు పుట్టాలి అంటే పుణ్యము చేసిన వాడి కడుపున పుడతాడా? పాపము చేసిన వాడి కడుపున పుడతాడా? అటువంటి వాడి కడుపున పుట్టడానికి ప్రహ్లాదుడు చేసిన…