భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకు పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్దుర్తిలో ప్రత్యేక వేసవి సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంబయ్య తెలిపారు. ఈనెల 11 నుంచి 25వ తేదీ వరకు మొత్తం 15 రోజుల పాటు ఈ సమ్మర్ క్యాంప్ కొనసాగనున్నట్లు వెల్లడించారు. వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా ఈ శిబిరాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఇందులో వ్యక్తిత్వ వికాస తరగతులు, యోగా, ధ్యానం, సంగీత శిక్షణ,…