భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: వెల్దుర్తిలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసి, వారి ప్రతిభను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వేసవి శిక్షణ శిబిరాన్ని ఘనంగా ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ అదర్శ్, ఉప సర్పంచ్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంబయ్య మాట్లాడుతూ.. విద్యార్థులు వేసవి సెలవులను కేవలం వినోదానికే పరిమితం చేయకుండా, ఇలాంటి శిక్షణ శిబిరాల ద్వారా కొత్త విషయాలను నేర్చుకోవాలని సూచించారు. పాఠ్యాంశాలతో పాటు కళలు, క్రీడలు,…