భారత్ సమాచార్, హైదరాబాద్ ;
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కు ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. హైడ్రా పేరుతో రేవంత్ ప్రభుత్వం హైడ్రామా నడుపుతోందన్నారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకుని పని చేస్తోందన్నారు. న్యాయం లేకుండా.. నోటీసులు ఇవ్వకుండా హైడ్రా పేరుతో డ్రామాలు చేస్తొందని విమర్శించారు. మానసికంగా.. పొలిటికల్ గా.. ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. అక్రమాలను బీఆర్ఎస్ ఎప్పటికీ సమర్థించదన్నారు. రాజకీయ ప్రేరేపితపై చర్యలను అధికారులు ప్రేరేపించటం కరెక్ట్ కాదన్నారు. అధికారులు అత్యుత్సాహం పోవద్దని…





