భారత్ సమాచార్, హైదరాబాద్ ; తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలకు రైతులు భారీగా
పంట నష్టపోయారు. వారికి ప్రభుత్వం అండగా నిలవాలని మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.

‘‘ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన అన్నదాతను అతలాకుతలం చేసింది. పంటలు చేతికి రానున్న సమయంలో కురిసిన వడగండ్ల వాన అన్నదాతలకు కన్నీరు మిగిల్చింది.వరి, మొక్కజొన్న, జొన్న పంటలతోపాటు బొప్పాయి, మామిడి సహా ఇతర…