భారత్ సమాచార్, ఏపీ: పల్నాడు, తాడిపత్రిలో ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనల నుంచి సాధారణ పరిస్థితికి వచ్చాయి. చంద్రగిరిలో మాత్రం ఇంకా 144 సెక్షన్ కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజు, ఆ తరువాత జరిగిన పరిణామాలతో పల్నాడ జిల్లాలోని పలు ప్రాంతాలు, అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులను పోలీసులు అదుపులోకి తీసుకువస్తున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో పోలింగ్‌, ఆ తరువాత రోజు జరిగిన గొడవలు, దాడులతో భయానక వాతావరణం నెలకొంది. అనేక మంది తీవ్ర స్థాయిలో గాయపడగా, వాహనాలు పెద్ద…