భారత్ సమాచార్.నెట్, నిర్మల్:
జల్సాలకు అలవాటు పడ్డ ఓ ఇంటి వ్యక్తి తన సొంతింటికే కన్నం వేశాడు. భార్య నగలను అపహరించి దొంగతనంగా చిత్రీకరించాడు. ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు గుట్టు రట్టైంది. రంగంలోకి దిగిన పోలీసులు తమ స్టైల్లో విచారణ జరుపగా సీసీ కెమెరాల్లో అసలు బండారం బట్టబయలైంది. భార్య నగలను అపహరించింది భర్తే అని తేలింది. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. నిర్మల్ పట్టణంలోని మహదేవపూర్ కాలనీలో అనితారాణి-శివ దంపతులు నివాసముంటున్నారు. భార్య…

