భారత్ సమాచార్,హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క శాఖను సమీక్షిస్తూ ముందుకెళ్తోంది. హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసే దిశగా ప్రయాణిస్తోంది. ఈక్రమంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని దానిలో పేర్కొంది. రూ.6.71లక్షల అప్పు చేసిందని తెలిపింది.
ఈ శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత.. ప్రతిపక్ష బీఆర్ఎస్ కు మాట్లాడే అవకాశాన్ని స్పీకర్ ఇచ్చారు. దానికి హరీశ్ రావు లేచి.. ‘‘మా చేతిలో 42 పేజీల…





