భారత్ సమాచార్, హైదరాబాద్: అక్రమ నిర్మాణాల కూల్చివేతలే ధ్యేయంగా.. ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటలు, బఫర్ జోన్ల పరిరక్షణే లక్ష్యంగా నెలకొల్పబడిన ‘హైడ్రా’ (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) తన పని తాను చేసుకుపోతోందని సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

చెరువలను ఆక్రమించి కట్టిన అక్రమ నిర్మాణాల విషయంలో ఎవరినీ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఓఆర్ఆర్ అవతల ఉన్న గ్రామ పంచాయతీలు కూడా హైడ్రా పరిధిలో ఉన్నాయని అన్నారు. ఫామ్‌హౌజ్‌లు కట్టుకున్న సెలబ్రిటీలు మురికి నీటిని…