భారత్ సమాచార్, ముంబయి ;
దేశంలో నిరుద్యోగ సమస్య ఎంతలా ఉందో తెలిపేందుకు మరో ఉదాహరణ మన ముందు నిలిచింది. ముంబయిలోని కలినా ప్రాంతంలో ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ నిర్వహించిన వాక్-ఇన్-ఇంటర్వ్యూలకు భారీగా నిరుద్యోగులు తరలిరావడంతో అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుంది. వారిని నియంత్రించలేక అధికారులు, పోలీసులు నానా అవస్తలు పడ్డారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 2,216 హ్యండీమాన్ ఖాళీలను భర్తీ చేసేందుకు ముంబయి ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించింది. కౌంటర్ల వద్ద…



