భారత్ సమాచార్, సినీ టాక్స్ : ప్రముఖ తార త్రిష గురించి తాను ఒక్క మాట తప్పుగా మాట్లాడలేదని, అలాంటప్పుడు తానేందుకు క్షమాపణ చెప్పాలని తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ తెగేసి చెప్పారు. త్రిషపై మన్సూర్ చేసిన వ్యాఖ్యలపై నాలుగైదు రోజులుగా దేశ వ్యాప్తంగా అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ రగడ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో నడిగర్ సంఘంతో పాటు పలువురు నటీమణులు మన్సూర్ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
దీనిపై మన్సూర్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ఈవిషయంలో తనవద్ద ఎలాంటి వివరణ…

