భారత్ సమాచార్, హైదరాబాద్: ఇన్నాళ్లు ఆమెకు బెయిల్ నిరాకరించిన న్యాయస్థానం.. ఎట్టేకేలకు బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు ఎందుకు ఇచ్చిందనే విషయంపై ప్రస్తుతం అందరికీ అనుమానం కలుగుతోందని వీహెచ్ హనుమంతరావు అన్నారు.  ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కవిత బెయిల్‌పై సీబీఐ, ఈడీ ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ అంతర్గత ఒప్పందం కుదుర్చుకోవడం వల్లే కవితకు బెయిల్ వచ్చిందని జోరుగా ప్రచారం జరుగుతోందని చెప్పారు. అందుకే దర్యాప్తు సంస్థలు కూడా సుప్రీంలో కౌంటర్ పిటిషన్స్ వేయలేదని, దర్యాప్తు పూర్తయినట్లు ఒప్పుకున్నాయని చెప్పినట్లు…