భారత్ సమాచార్, అమరావతి ;

గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లో కానిస్టేబుల్ నియామక ప్రక్రియ అర్ధాంతరంగా నిలిచిపోయింది. సత్వరమే ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. 6,100 పోస్టుల భర్తీకి సంబంధించిన శారీరక సామర్థ్య (పీఎంటీ,పీఈటీ) పరీక్షలను ఐదు నెలల్లోగా పూర్తి చేస్తామని ఆమె స్పష్టం చేశారు. గత 2022 కాలంలో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 4,59,182 మంది హాజరు కాగా అందులో 95,209 మంది తదుపరి దశకు…