భారత్ సమాచార్, రాజకీయం : తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఆటో డ్రైవర్ల జీవనోపాధికి భారీగా గండికొడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమ్యగోచరంగా మారింది. నిరుద్యోగులు, యువకులు, పేద, మధ్యతరగతి, బహుజన కులాల వారే ఎక్కువగా ఆటో డ్రైవర్లుగా తమ బతుకు బండిని నడిపిస్తుంటారు. ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆటోలను ఎక్కేవారు లేక రోజుకు కనీసం రూ.500లను కూడా సంపాదించలేకపోతున్నామని వారు దీనంగా వాపోతున్నారు. వాస్తవానికి ఆటోలను ఎక్కువగా ప్రయాణించేంది మహిళలే. పురుషులు,…