
భారత్ సమాచార్, యాదాద్రిభువనగిరి : యువత స్వయం ఉపాధి దిశగా ముందుకెళ్లాలని JYG ఫౌండేషన్ అధినేత, బీఆర్ఎస్ యువ నాయకుడు జడల యశీల్ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన నివాసంలో నిర్వహించిన సమావేశంలో జర్నలిస్ట్ యంజాల ధనకుమార్ పటేల్‌కు చెందిన ‘A1లోకల్ యూట్యూబ్ ఛానెల్’ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఉపాధి దిశగా ముందడుగు వేస్తూ సమాజంపట్ల బాధ్యత గల వృత్తిలో రాణించడం గొప్పవిషయమని, భవిష్యత్‌లో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థానానికి చేరుకోవాలని యశీల్ గౌడ్ సూచించారు.
ఒకవైపు వృత్తిపట్ల బాధ్యతయుతంగా వ్యవహరిస్తూ, మరోవైపు…





