భారత్ సమాచార్, సినీ టాక్స్ ; టాలీవుడ్ సినీ ప్రియులకు మరపురాని ప్రేమ కథా చిత్రం ‘నువ్వు-నేను’. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయం నమోదు చేసింది ఈ మూవీ. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో రీరిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ‘నువ్వు-నేను’ సినిమాని కూడా మళ్లీ థియేటర్ లో అని అంటున్నారు ప్రేక్షకులు. ఈ లవ్, మ్యూజికల్ మ్యాజిక్ మార్చి 21న 4కె క్వాలీటీతో మళ్లీ వెండితెరపై సందడి చేయనుంది.
2001 ఆగష్టు 10న ఈ మూవీ విడుదలైంది. ఉదయ కిరణ్, అనిత జంటగా నటించగా తేజ దర్శకత్వం వహించాడు. ఆర్.పి.పట్నాయక్ సంగీతం కుర్రకారును అమితంగా ఆకట్టుకుంది. ఇందులోని అన్ని పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ చిత్రానికి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ హాస్యనటుడు,
ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ ఛాయాగ్రాహకుడు, ఉత్తమ సహాయ నటుడు విభాగాల్లో ఐదు నంది పురస్కారాలు దక్కాయి. నాలుగు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు అందాయి.