Homemain slides‘ఓం భీమ్ బుష్’ ట్రైలర్ రిలీజ్

‘ఓం భీమ్ బుష్’ ట్రైలర్ రిలీజ్

భారత్ సమాచార్, సినీ టాక్స్ ; గుప్త నిధుల కోసం అన్వేషణ మొదలు పెట్టారు ముగ్గురు బ్యాంగ్ బ్రోస్. వాళ్లే శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణా. వీళ్లు ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’. ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు దర్శక నిర్మాతలు. వీళ్లకు ఒక ఊరిలో నిధి ఉందన్న సమాచారం అందింది. దీంతో ఇంకేం ఆలోచించకుండా అక్కడికి వెళ్లిపోయారు. ఇక్కడి నుంచి అసలు సినిమా మొదలవుతుంది. కామెడీగా సాగుతున్న మూవీ కాస్త హారర్ గా మారుతోంది. మరి వెండితెరపై దెయ్యం కామెడీ సినీ ప్రేక్షకులను మరోసారి మెప్పిస్తుందా అనే విషయం తెలియాలంటే ఈ సినిమా విడుదల వరకూ ఎదరు చూడాల్సిందే మరి.  గుప్త నిధుల కోసం సైటింస్టులుగా మారి వీరు చేసే హంగామా బాగుంది. కామెడీ టైమింగ్ బాగా కుదిరింది. ‘హుషారు’ ఫేమ్ హర్ష దర్శకుడు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మార్చి 22 న సినీ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సన్నీ సంగీతం అందించాడు. ‘సామజవరగమణ’ హిట్ తో మంచి ఊపు మీద ఉన్న శ్రీ విష్ఘు మరో హిట్ మూవీని తన ఖాతాలో వేసుకోటానికి రెడీ అవుతున్నాడు.

మరికొన్ని సినీ సంగతులు…

5 రోజుల్లో 85 కోట్లు… అట్లుంటది మనతోని

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments