భారత్ సమాచార్, అంతర్జాతీయం : దాదాపుగా 7 దశాబ్దాల ప్రజాస్వామ్య దేశం పాకిస్తాన్ కానీ ఒక్క సారి కూడా ఒక్క ప్రధాని కూడా పూర్తి ఐదేళ్ల పరిపాలనకు నోచుకోలేదు. ప్రజాస్వామ్యం పేరు చెప్పుకొని సైనికాధ్యాక్షులు ఆడించే ఆటగా మారింది పాక్ రాజకీయం. పాక్ జాతీయ పార్లమెంటుకు ఫిబ్రవరి 8వ తేదీన ఎన్నికలు నిర్వహించారు. ఎలక్షన్ జరిగిన రోజు ఏమో దేశ వ్యాప్తంగా చాలా చోట్ల ఇంటర్ నెట్ ను, మైబైల్ సేవలను, ప్రత్యేక్ష ప్రసారాలను నిలిపివేశారు. ఎన్నికల కౌంటింగ్ మొదలై రెండు రోజులు గడుస్తున్నా ఇంకా ఫలితాలు పూర్తిగా ప్రకటించలేదు.
జైలు రాజకీయాలు…
ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ (PTI పార్టీ) ప్రభుత్వాన్ని పడగొట్టి, అవినీతి కేసులు పెట్టి జైలుకు పంపింది సైన్యం. ఎన్నికల సంఘం నుంచి పార్టీ గుర్తింపును తొలగించారు. ఇమ్రాన్ ఖాన్
జైలులో ఉండి తమ అభ్యర్థులను స్వతంత్రులుగా బరిలో నిలిపారు. పోలింగ్ సమయానికి ముందు అవినీతి కేసులో శిక్ష పడి జైలుకి వెళ్లి, బెయిల్ పై వచ్చి లండన్ లో తలదాచుకున్న నవాజ్ షరీఫ్ ను ఏమో (PML పార్టీ) ప్రధాని అభ్యర్థిగా బాహాటంగానే మద్దతునిచ్చి నిలబెట్టింది అక్కడి సైన్యం.
పశ్చిమ దేశాల అభ్యంతరం…
కౌటింగ్ ప్రక్రియ మొదలైనప్పుడు ఇమ్రాన్ ఖాన్ మద్దతు తెలిపిన స్వతంత్ర అభ్యర్థులు లీడ్ లోకి వస్తుంటే కౌటింగ్ ఆపేయటం, వారికి అనుకూలంగా రిగ్గింగ్ చేయటం చేస్తుంది సైన్యం. స్వయంగా పాక్ సైనికాధ్యక్షుడు ఆసీమ్ మునీర్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ను ప్రధాని పీఠం ఎక్కించాలని చెబుతున్నాడు. పాక్ లో జరుగుతున్న ఎలక్షన్ తీరుపై కొన్ని పశ్చిమ దేశాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి.
అప్రజాస్వామ్యం…
ఈ మాత్రం దానికి దేశానికి ఒక రాజ్యాంగం, ఎన్నికల కమిషన్, సుప్రీం కోర్టు, వందల కోట్లు ప్రజా ధనం ఖర్చు పెట్టి ఎన్నికలు జరపటం ఎందుకో? పక్కనున్న మియన్మార్, ఆఫ్ఝనిస్తాన్ లాగా డైరెక్టుగా సైనిక పాలనే పెట్టుకుంటే సరిపోతుంది కదా అంటున్నారు ప్రజాసామ్య వాదులు.