Parliament: ఉభయసభలు సోమవారానికి వాయిదా

భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: పార్లమెంట్‌ ఉభయ సభల్లో మరోసారి వాయిదా పడ్డాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి విపక్షాల నిరసనలతో వాయిదా పడుతున్నే ఉన్నాయి. శుక్రవారం కూడా విపక్షాల నిరసనలతో ఉభయ సభలు స్తంభించాయి. బీహార్‌ ఓటర్ల జాబితా అంశంపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో పార్లమెంట్‌లో గందరగోళ పరిస్థితులు ఏర్పడటంతో.. ఉభయసభలు సోమవారానికి వాయిదా వేశారు ఇరు సభల స్పీకర్లు.

 

ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఉభయ సభల్లో.. వాయిదా తీర్మానాలపై చర్చలకు వీపక్షాలు పట్టుబట్టాయి. బీహార్ ఓటర్ అంశంపై సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. విపక్షాల ఆందోళనతో మొదలైన కొద్ది నిమిషాల్లోనే మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. తిరిగి ప్రారంభమైన సభలో విపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అటూ రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

 

మరోవైపు స్పీకర్ ఓం బిర్లా ఛాంబర్‌లో అఖలపక్ష సమావేశం జరిగింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధి, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సహా పలువురు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సభా కార్యకలాపాలు సజావుగా సాగేలా సభ్యులంతా సహకరించాలని స్పీకర్ ఓం బిలర్లా వారికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలోనే కేంద్రం, ప్రతిపక్ష నేతల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. అదే నిజమైతే సోమవారం నుంచి పార్లమెంట్ కార్యకాలపాలు సజావుగా జరగనున్నాయి.

 

Share This Post