భారత్ సమాచార్.నెట్: స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ చిత్రం హరి హర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో.. ఏఏం రత్నం నిర్మించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. భారీ అంచనాల నడుమ జూలై 24 వ తేదీని ప్రేక్షకుల మందుకు వచ్చిని ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. హిట్ టాక్‌తో పాటు మూవీ కలెక్షన్స్ కూడా జరుగానే ఉన్నాయి.
మూవీ విడుదలైన మూడు రోజుల కలెక్షన్స్ కలెక్షన్స్ తక్కువగా చూపించిన.. వీకెండ్ కావడంతో ప్రస్తుతం మంచి కలెక్షన్స్‌నే రాబడుతోంది. ఫస్ట్ డే రూ. 34 కోట్లు వసూలు చేయగా.. రెండో రోజు సినిమాకు నెగిటీవ్ టాక్ రావడంతో కేవలం రూ. 8 కోట్లు మాత్రమే వచ్చాయి. మూడో రోజు శనివారం రూ. 9.86 కోట్ల నెట్ కలెక్షన్స్ దక్కించుకుంది. మూడో రోజు కాస్తా మోస్తరుగా ముందుకు వచ్చినప్పటికీ చాలా తక్కువే వసూళ్లు చేసింది.
ఇక ప్రీమియర్ షోలకు రూ. 12 కోట్లు వచ్చినట్లు సమాచారం. ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూలే రాబడుతోంది ఈ చిత్రం. తెలుగు రాష్ట్రాలతో కలిపి వరల్డ్ వైడగా హరి హర వీరమల్లు 126 కోట్ల రూపాయల కలెక్షన్స్ చేసినట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్‌గా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 127 నుంచి రూ. 130 కోట్లు షేర్.. రూ. 260 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయాల్సి ఉంది.