Homebreaking updates newsప్రధాని మోదీకి మరో అత్యున్నత పురస్కారం

ప్రధాని మోదీకి మరో అత్యున్నత పురస్కారం

భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: భారత్ ప్రధాని మోదీ (Prime Minister of India) మారిషస్ పర్యటన దిగ్విజయంగా కొనసాగుతోంది. మారిషస్(Mauritius) స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ అక్కడికి వెళ్లారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీకి మారిషన్‌ పర్యటనలో మరో అత్యున్నత పురస్కారం లభించింది. (Mauritiuss Highest Honour) మారిషస్ అత్యున్నత పురస్కారమైన “ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్” ను ఆ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామ్‌గులాం (Navinchandra Ramgoolam) ప్రకటించారు. ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయుడు ప్రధాని మోదీ కాగా.. ఇది ఆయనకు వచ్చిన 21వ అంతర్జాతీయ అవార్డు కావడం విశేషం.

ఇక ఈ కార్యక్రమంలోనే మారిషస్ ప్రధాని రామ్‌గులం ప్రధాని మోదీకి ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించారు. మార్చి 12, 1992న మారిషస్ స్వతంత్ర దేశంగా మారిన నాటి నుంచి ఐదుగురు విదేశీ ప్రముఖులను ‘ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది హిందూ మహాసముద్రం’తో సత్కరించారని రామ్‌గులం అన్నారు. 1998లో జాతి వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు నెల్సన్ మండేలా (Nelson Mandela) దీనిని మొదటిసారిగా అందుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఇకపోతే ప్రధాని మోదీ కూడా మారిషస్ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గులాం ఆయన సతీమణి వీణా రామ్‌గులాంలకు ఓవర్సిస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా (Overseas Citizen of India) కార్డులు అందేశారు.

మరోవైపు సాంస్కృతిక మార్పడిలో భాగంగా మారిషస్‌ అధ్యక్షుడు ధరమ్బీర్‌ గోకుల్‌(Mauritius President Dharambeer Gokhool)కు ప్రధాని మోదీ ప్రత్యేక కానుకలు అందించారు. ఇత్తడి, రాగితో చేసిన ప్రత్యేక కలశంలో తీసుకెళ్లిన మహాకుంభమేళా సంగమ జలాల(Maha Kumbh Mela Holy Water)ను బహుకరించారు. బిహార్‌ నుంచి తీసుకొచ్చిన మకానాతో పాటు డ్రై ఫ్రూట్స్‌ను అందించారు. మారిషన్ అధ్యక్షుడి భార్య బృందా గోకుల్‌కు గుజరాత్‌లో నేసిన బెనారస్‌ పట్టు చీరను అందజేశారు. అది అందిస్తూ ఇది తన స్వరాష్ట్రంలో తయారైన చీర అని ప్రధాని మోదీ గర్వంగా చెప్పారు. కాగా, ప్రధాని మోదీ ఆ దేశానికి వెళ్లడం ఇదే తొలిసారి కాదు. 1988లో గుజరాత్‌లో బీజేపీ భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ప్రధాని మోదీ.. మారిషస్‌లోని మెకా ప్రాంతంలో జరిగిన అంతర్జాతీయ రామాయణ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. ముఖ్యంగా అక్కడ భారత సంతతి జనాభా ఎక్కువగా ఉండడం వల్ల ఆ దేశాన్ని మినీ ఇండియాగా పిలుస్తుంటారు. ప్రధాని మోదీ కూడా ఇదే విషయాన్ని చెబుతూ.. తన తొలి పర్యటన ఫొటోలను షేర్ చేస్తూ తన అనుబంధాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments