Homebreaking updates news27 ఏళ్ల నాటి ప్రధాని మోదీ ఫొటో వైరల్

27 ఏళ్ల నాటి ప్రధాని మోదీ ఫొటో వైరల్

భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: ప్రస్తుతం మినీ ఇండియాగా పిలుచుకునే మారిషస్‌ (Mauritius)కు ప్రధాని మోదీ (PM Modi) వెళ్లిన సంగతి తెలిసిందే. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ అక్కడికి వెళ్లారు. అయితే ప్రధాని హోదాలో రెండోసారి ఆ దేశం వెళ్లారు. తాను ఆ దేశానికి వెళ్లడం ఇదే తొలిసారి కాదని.. గతంలోనే రెండు సార్లు వెళ్లినట్లు మోదీ గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా అప్పుడు అక్కడకు ఎందుకు వెళ్లారో చెబుతూనే నాటి ఫొటోలను షేర్ చేశారు. 27 ఏళ్ల క్రితం దిగిన ఆ ఫొటోల్లో మోదీ చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు. అప్పటికి ఆయన వయసు 47 ఏళ్లు కాగా.. పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తూ అందరికీ షాక్ ఇస్తున్నారు.

 

1988లో గుజరాత్‌లో బీజేపీ భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ప్రధాని మోదీ.. మారిషస్‌లోని మెకా ప్రాంతంలో జరిగిన అంతర్జాతీయ రామాయణ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. ముఖ్యంగా అక్కడ భారత సంతతి జనాభా ఎక్కువగా ఉండడం వల్ల ఆ దేశాన్ని మినీ ఇండియాగా పిలుస్తుంటారు. ప్రధాని మోదీ కూడా ఇదే విషయాన్ని చెబుతూ.. తన తొలి పర్యటన ఫొటోలను షేర్ చేస్తూ తన అనుబంధాన్ని వెల్లడించారు. అప్పట్లో బీజేపీ కార్యదర్శిగా అక్కడ పర్యటించారు. తర్వాత ప్రధాని హోదాలో 17 ఏళ్ల తర్వాత ఆ దేశంలో పర్యటించారు. అప్పుడు గంగా తలావోను సందర్శించారు. ఆ తర్వాత 2015లో ఆ దేశ నేషనల్ డేలో పాల్గొన్నారు. ఇప్పుడు మరోసారి దాదాపు పదేళ్ల తర్వాత ప్రధాని హోదాలో మరోసారి 57వ నేషనల్ డే వేడుకలకు కు చీఫ్ గెస్ట్‌గా మారిషస్‌కు వెళ్లారు ప్రధాని మోదీ.

 

ఇక ప్రధాని మోదీ షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో మోదీక 47 ఏళ్ల వయసు ఉండగా.. చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు. చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు సార్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కాగా ప్రధాని మోదీ మారిషస్‌ పర్యటనకు ముందు ట్వీట్ చేశారు. మారిషస్ హిందూ మహాసముద్రంలో మన కీలక భాగస్వామి మాత్రమే కాదని.. ఆఫ్రికా ఖండానికి ముఖద్వారం కూడా అని పేర్కొన్నారు. చారిత్రకంగా, భౌగోళికంగా, సాంస్కృతికంగా మనకు ఆ దేశంతో అనుబంధం ఉందని రాసుకొచ్చారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments