Homemain slidesగాంధీ జయంతి రోజున ప్రశాంత్ కిషోర్...

గాంధీ జయంతి రోజున ప్రశాంత్ కిషోర్…

భారత్ సమాచార్, జాతీయం ;

పదేళ్ల క్రితం కూడా దేశ రాజకీయ వర్గాల్లో పొలిటికల్ స్ట్రాటజిక్ కన్సల్టెన్సీ (రాజకీయ వ్యూహకర్తలు) అంటే ఎవ్వరికీ తెలీదు. ప్రస్తుతం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు కూడా ప్రత్యేకంగా రాజకీయ వ్యూహకర్తలు ఉన్నారు. దేశ ఎన్నికల రాజకీయ వ్యూహకర్తల్లో ప్రముఖంగా వినిపించే పేరు ప్రశాంత్ కిషోర్. ఆయన స్థాపించిన ఐప్యాక్ పొలిటికల్ కన్సల్టెన్సీ కూడా దేశ రాజకీయాల్లో చాలా ఫేమస్. కొద్ది కాలం క్రితం ప్రశాంత్ కిషోర్ (పీకే) ఎన్నికల వ్యూహకర్తగా కెరీర్ కి స్వస్తి పలికి రాజకీయ వేత్తగా ప్రయాణం ప్రారంభించాడు. ఇందుకోసం ఆయన సొంత రాష్ట్రం బిహార్ లో జన్ సూరజ్ యాత్ర పేరిట పాదయాత్ర ను కూడా ప్రారంభించాడు. బిహార్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి విజయం కూడా సాధించాడు. దేశంలోని చాలా మందిని సీఎం కుర్చిలో కూర్చోపెట్టిన ప్రశాంత్ కిషోర్ తను కూడా సీఎం కావాలనుకుంటున్నాడు.

అందుకోసం గాంధీ జయంతి రోజున (అక్టోబర్ 2వ తేదీ) కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. బిహార్ లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని కూడా చెప్పారు. ఆయన చేపట్టిన జన్ సూరాజ్ యాత్రకి అక్టోబర్ 2 నాటికి రెండేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా కొత్త పార్టీ ప్రకటన ఉంటుందన్నారు. కుల రాజకీయాలు ఎక్కువగా ఉన్న బిహార్ లో పీకే పార్టీ ఎలాంటి ప్రభావం చూపనుందో అని దేశ రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇదే రాష్ట్రంలో పీకే నితీష్ కుమార్ సీఎం అవ్వటం కోసం ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే.

మరికొన్ని వార్తా విశేషాలు…

ఎస్ ఐ లుగా సెలక్ట్ అయిన ట్రాన్స్ జెండర్స్

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments