భారత్ సమాచార్, సినీ టాక్స్ : దేశమంతా ‘సలార్’ హవా నడుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలార్.. మరో మూడు రోజుల్లో(డిసెంబర్ 22న) థియేటర్లలోకి వస్తుండడంతో వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇప్పటికే పలుచోట్ల అడ్వాన్స్ బుక్కింగ్స్ లు ప్రారంభమయ్యాయి. ఓవర్సీస్ లో బుక్కింగ్స్ దుమ్మురేపుతున్నాయని తెలుస్తోంది.
తాజాగా సలార్ టీం దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ చేస్తోంది. ఈసందర్భంగా సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ మూవీపై కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు.. సలార్ మూవీకి కేజీఎఫ్ తో గాని, కేజీఎఫ్ యూనివర్స్ తో గాని ఏ కనెక్షన్ లేదని చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని తాను ఫ్యాన్స్ కు ముందే చెబితే బాగుండేదని తెలిపాడు.
కాగా, ప్రశాంత్ నీల్ కామెంట్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇన్నాళ్లూ సలార్ మూవీకి కేజీఎఫ్ కు కథలో సంబంధం ఉంటుందని ఫ్యాన్స్ భావించారు. ఫస్ట్ లుక్ కానీ, టీజర్లు కానీ, ఫొటోస్ కానీ అన్నీ చూశాక అంతా కేజీఎఫ్ స్టైల్ లోనే ఉండడంతో ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు. మళ్లీ సేమ్ నరేషన్ ఉండి.. ఆడియన్స్ కొత్తదనంగా ఫీల్ కాకపోతే సినిమాకు దెబ్బపడే అవకాశం ఉందని ఆందోళన పడ్డారు. కేజీఎఫ్ కథ, స్క్రీన్ ప్లే కొత్తగా ఉండడంతోనే అంత పెద్ద హిట్ అయ్యింది. మళ్లీ అదేబాటలో, అదే స్టోరీ, అదే స్క్రీన్ ప్లే ఉంటే సలార్ లో ఇంకా కొత్త ధనం ఏముంటుందని ఫ్యాన్స్ భయపడ్డారు. ఇప్పటికే ప్రభాస్ కు బహూబలి రేంజ్ లో ఒక్క బ్లాక్ బస్టర్ రాలేదు. ఆ కొరతను సలార్ తీరుస్తుందనే అంచనాతో ఉన్నారు. ఎవరూ ఊహించని విధంగా సలార్ ఉండాలని.. కేజీఎఫ్ ఛాయలే సలార్ లో ఉండొద్దని వారు అభిప్రాయపడుతున్నారు.