భారత్ సమాచార్ ; ఇప్పటికే చాలా మంది మరచిపోయినట్టు ఉన్నారు టాలీవుడ్ లో నారా రోహిత్ అనే హీరో ఉన్నాడని. కొద్ది మంది రాజకీయ నాయకులు ఐదేళ్లకోసారి ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే జనంలోకి వచ్చి ప్రచారం నిర్వహిస్తారు. అచ్చం అలాగే వెండితెరపై ఎలక్షన్ సమయంలోనే మాత్రమే కనిపిస్తున్నాడు నారారోహిత్. ఇంతకు ముందు 2018 లో ‘పండగలా వచ్చాడు’ మూవీతో వెండితెరపై ప్రేక్షకులకు కనిపించాడు. మళ్లీ ఇప్పుడు 2024లో ‘ప్రతినిధి 2’ టీజర్ తో సినీ ప్రేమికులను పలకరిస్తున్నాడు. 2014 లో విడుదలైన ‘ప్రతినిధి’ చిత్రానికి సీక్వెల్ ఇది.
తాజాగా విడుదలైన టీజర్ ని చూస్తే ఎలక్షన్ సమయం కాబట్టి ప్రస్తుత రాజకీయాలపై సినిమాని రూపొందించినట్టు అర్థం అవుతోంది. గ్యాప్ వచ్చిన ఈ నటుడి అప్పీరెన్స్ మాత్రం కొంచెం యాక్సప్ట్ చేసేలాగే ఉంది. పూర్తిగా ఒక రాజకీయ పార్టీకి ఫేవర్ గా ఈ మూవీని రూపొందించినట్టు టాలీవుడ్ టాక్. ‘ఇప్పటికైనా కళ్లు తెరవండీ, వళ్లు విరిచి బయటకి వచ్చి ఓటు వేయండి, లేదంటే ఈ దేశం విడిచి వెళ్లిపోండి, అది కుదరక పోతే చచ్చిపోండీ’ అనే డైలాగ్ టీజర్ లో హైలెట్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని ప్రముఖ యాంకర్ మూర్తి డైరెక్టర్ గా మారి తెరకెక్కించాడు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా టీజర్ ను లాంచ్ చేశారు. కుమార్ నిర్మాత. మహతి స్వర సాగర్ సంగీతం అందించాడు. టీజర్ లోని బీజీఎం బాగుంది. ఈ ఏఫ్రిల్ లోనే ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు దర్శక నిర్మాతలు వెల్లడించారు.
మరికొన్ని సినీ విశేషాలు…