భారత్ సమాచార్, తెలంగాణ: జనగామ జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్ హాస్పిటల్ లో ఓ మహిళ వింత నాటకం ఆడింది. చివరికి అసలు విషయం తెలిసి అందరూ అవాక్కు అయ్యారు. అసలు ఆమె అలా ఎందుకు నాటకం ఆడిందో తెలియక అక్కడున్న వారంతా జుట్టుపీక్కున్నారు. వివరాల్లోకి వెళితే జనగామ జిల్లా దేవరుప్పుల మండలం మొండ్రాయి గ్రామ తండా ప్రాంతానికి చెందిన ఓ మహిళ తాను ప్రెగ్నెంట్ అంటూ జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్ హాస్పిటల్ లో బుధవారం అడ్మిట్ అయింది. కొంత సమయం తరువాత మల విసర్జనకు మరుగుదొడ్డిలోకి వెళ్లి అర్థ గంట తర్వాత బయటకు వచ్చింది.
అనంతరం అక్కడే తనకు అబార్షన్ అయిందని, పుట్టిన బాబు అందులో జారి పడ్డాడని హంగామా చేసింది. దీన్ని గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై శానిటేషన్ సిబ్బందితో వెతికించారు. అనంతరం ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో డాక్టర్లు పరీక్షించారు. దాంతో అసలు ఆమె ప్రెగ్నెంట్ కాదని, గుడ్డలు చుట్టుకొని ఇప్పటి వరకు తన భర్తను మోసం చేసిందని తేలింది. విషయం తెలిసి అక్కడున్న ప్రజలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అసలు విషయం ఆమె చెప్పకపోవడంతో ఇలా చేయడానికి గల కారణం చూసి అక్కడ ఉన్నవారు బిత్తరపోయారు.
ప్రెగ్నెంట్ అంటూ మహిళ వింత నాటకం
RELATED ARTICLES