భారత్ సమాచార్, సినీ టాక్స్ : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మరోసారి ఇప్పుడు వార్తల్లో నిలిచాడు. తాజాగా అతడి పై విషప్రయోగం జరిగి పాకిస్తాన్ దేశంలోని కరాచీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు అనే వార్తలు వచ్చాయి. అతడు చనిపోయాడు అని కూడా పుకార్లు పుట్టాయి. దావూద్ వార్తల్లో నిలువడంతో ప్రస్తుతం అతడి గురించి తెలుసుకునేందుకు నేటి జనరేషన్ గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. అతడి నేరమయ, విలాసవంత జీవితం గురించి తెలుసుకుంటున్నారు. అప్పట్లో అతడి వలలో పడి ఓ టాప్ హీరోయిన్ తన కెరీర్ ను పాడు చేసుకుంది. ఆమే మోస్ట్ బ్యూటీఫుల్ హీరోయిన్ మందాకిని.
1980,90 దశకాల్లో బాలీవుడ్ లో మందాకిని ఓ వెలుగు వెలిగింది. తన అందచందాలతో అప్పటి కుర్రకారును ఓ ఊపు ఊపేసింది. రాజ్ కపూర్ తెరకెక్కించిన ‘రామ్ తేరీ గంగా మైలీ’తో ఆమె తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అది సూపర్ హిట్ కావడంతో మందాకిని ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. నిర్మాతలు, బడా హీరోలు ఆమెతో చేయడానికి క్యూ కట్టారు. అప్పటికే డాన్ గా ముంబైని అల్లాడిస్తున్న దావూద్ కూడా మందాకిని అందానికి ఫిదా అయ్యాడు. ఎలాగైనా ఆమెను తనదాన్ని చేసుకోవాలని భావించాడు. చివరకు ఆమెను తన ప్రేమలో పడేశాడు. ఇద్దరూ చెట్టాపట్టాలెసుకుని తిరిగారు. విలాసవంతమైన జీవితం గడిపారు. అయితే అండర్ వరల్డ్ డాన్, క్రిమినల్ అయిన మందాకిని కెరీర్ కు దెబ్బపడింది.
1994లో దుబాయ్ లోని ఓ క్రికెట్ స్టేడియంలో దావూద్, మందాకిని పక్కపక్కనే కూర్చుని ఉన్న ఫొటో ఒక్కటి బయటకొచ్చింది. ఈ ఫొటో అప్పట్లో పెను సంచలనమైంది. ఈ ఫొటోతో మందాకిని పలు ఆరోపణలు వచ్చాయి. దావూద్ నేరకార్యకలాపాల్లో మందాకినికి చోటు ఉందని తెలిసి బాలీవుడ్ మేకర్స్ అవకాశాలు ఇవ్వడానికి భయపడ్డారు. అలాగే హీరోలు కూడా తమకెందుకీ గొడవ అని ఆమెన పక్కనపెట్టారు. దీంతో ఉన్నతశిఖరంపై ఉన్న ఆమె కెరీర్ కుప్పకూలిపోయింది. ఆమె చివరి సినిమా 1996లో వచ్చిన జోర్డా.