భారత్ సమాచార్,సినీ టాక్స్ ;
చిత్రం ; గుణ
దర్శకుడు ; సంతాన భారతి
సంగీతం ; ఇళయరాజా
సాహిత్యం ; వెన్నెలకంటి
గానం ; ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ
రాయ్… రాయిూ… ఏం రాయాలి ? లెటర్,
ఏవరికి ? నీకు, నాకా…
నాకు రాయటం రాదు, ఈ మధ్య నే సంతకం పెట్టడం నేర్చుకున్న,
వెయిట్, వెయిట్,
నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి,
నాకు చదివి వినిపించి, తర్వాత నువ్వు చదువుకో,
ఐ లైక్ ఇట్,… చెప్పు
నా ప్రియ, ప్రేమతో… నీకు నేను, నేను రాసే ఉత్తరం, లెటర్ చ్చ, కాదు ఉత్తరమే అని రాయ్, చదువు..
కమ్మనీ ఈ ప్రేమ లేఖనే రాసింది హ్రుదయమే
పాటలా మార్చి రాశావ, అప్పుడు నేను కూడా మారుస్తా,
మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమ అని మార్చు,
ప్రియతమ నీవు ఇచట క్షేమమా, నేను ఇక్కడ క్షేమం
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే
ఆహా, ఓహో.. నిన్ను ఊహించుటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే, మాటలే
ఉహాలన్ని పాటలే కనుల తోటలో… అదే
తొలి కలల కవితలే మాట మాటలొ..అదే, ఆహా… బ్రహ్మాండం, కవిత కవిత పాడు
కమ్మనీ ఈ ప్రేమ లేఖనే రాసింది హ్రుదయమే
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే
ఉహాలన్ని పాటలే కనుల తోటలో
తొలి కలల కవితలే మాట మాటలొ
ఒహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హ్రుదయమే
ప్రియతమ నీవచట కుశలమా నేనిచట కుశలమే
హుమ్… నాకు తగిలిన గాయం అయితే చల్లగా మానిపోతుంది
అదేంటో నాకు తెలీదు ఏ మాయో తెలీదు, నాకు ఏమీ కాదు అసలు, ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు, నవ్వు, ప్రేమ అలాంటివి వేసుకోవాలి, ఆ…
ఇదిగో చూడు నాకు ఏ గాయం అయినప్పటికి ఒళ్లు తట్టుకుంటుంది, నీ ఒళ్లు తట్టుకుంటుందా? తట్టుకోలేదు. ఉమాదేవి, దేవీ, ఉమాదేవి. అది కూడా రాయాలా ? అది ప్రేమ.. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలీక ఇదవుతుంటే ఏడుపొస్తోంది. కానీ నేను ఏడ్చి నా శోకం నిన్ను కూడా బాధపెడుతున్న అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది…
మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు, అగ్ని లాగ స్వచ్ఛ మైనది..
గుండెల్లో గాయమేదొ చల్లంగా మానిపోయే
మాయ చేసే ఆ మాయే ప్రేమాయే
ఎంత గాయమైన గాని నా మేనికేమిగాదు
పువ్వు సోకి నీ సోకు కందేనే
వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది
నాదు శోకమోపలేక నీ గుండె బాధ పడితే తాళనన్నది
మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు
అగ్ని కంటే స్వచ్ఛమైనది
మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా
ఉమాదేవి గా శివుని అర్థ భాగమై నా లోన నిలువుమా
శుభ లాలి లాలి జో లాలి లాలి జో ఉమా దేవి లాలి లాలి జో లాలి లాలి జో
మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా నా హృదయమా