భారత్ సమాచార్. నెట్, ముంబై: ‘బ్రహ్మాస్త్ర’తో బిగ్ స్క్రీన్‌పై మ్యాజిక్ క్రియేట్ చేసిన రియల్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ మరోసారి కలువబోతున్నారు. వారిద్దరూ కలిసి మరో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ‘బ్రహ్మాస్త్ర 2’పై ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో, ఈ జంట మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో నటించబోతున్నారనే వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాకు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. అలాగే ఈ ప్రాజెక్ట్‌లో విక్కీ కౌషల్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారట. ఈ మూవీ ‘లవ్ & వార్’ థీమ్ మీద ఆధారపడిన ఎమోషనల్ యాక్షన్ డ్రామా గా ఉండబోతుందట. అంతేకాదు, ఇప్పటికే రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారట – 2026 మార్చి 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందట!
ఇక రణబీర్ ‘యానిమల్’తో, విక్కీ ‘ఛావా’తో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తారంటే క్రేజ్ మామూలుగా ఉండదు. అలియాతో కలిసి రణబీర్ స్క్రీన్‌పై మళ్లీ కనిపించనున్నాడనే ఫీలింగ్‌తో ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. ఈ కాంబినేషన్ పై ఇప్పుడే సోషల్ మీడియాలో విపరీంగా హైప్ నడుస్తోంది. అంతేకాకుండా, భన్సాలీలో అలియా–రణబీర్–విక్కీ ట్రిపుల్ పవర్ కాంబో అంటే సినీ లవర్స్ క్యూరియస్ గా ఉన్నారు.
Bollywood News: రణబీర్ – అలియా మళ్లీ కలుస్తారా?
RELATED ARTICLES