భారత్ సమాచార్.నెట్: టాలీవుడ్, బాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరో కొత్త ప్రాజెక్టులో అడుగుపెట్టింది. తన కెరీర్‌లో మునుపెన్నడూ చేయని, కనిపించని సరికొత్త పాత్రలో రష్మిక దర్శనమివ్వనుంది. “మైసా” అనే పేరుతో రూపొందుతున్న చిత్రాన్నికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రష్మిక చేతిలో కత్తి పట్టుకొని, భయంకరమైన గర్జనతో పవర్ ఫుల్ లుక్‌లో కనిపించింది. ఈ సినిమాలో రష్మిక ఇంతకముందు ఎప్పుడూ కనిపించని ఓ భిన్నమైన పాత్రను పోషించనుంది.
పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో విడుదల కానున్న ‘మైసా’ చిత్రాన్ని ‘అర్ధ శతాబ్దం’ ఫేమ్ రవీంద్ర పూలే దర్శకత్వం వహించనుండగా.. ‘అన్‌ఫార్ములా ఫిల్మ్స్’ బ్యానర్‌పై అజయ్, అనిల్ సాయపరెడ్డిలు నిర్మిస్తున్నారు. ముఖ్యంగా, ఈ ప్రాజెక్ట్ హీరోయిన్-సెంట్రిక్ కథనం కావడంతో, రష్మిక నటనకు పూర్తి ఆస్కారం ఉంటుంది. అలాగే ఇది రష్మిక కెరీర్‌లో మరో కీలక ప్రాజెక్ట్ కానుంది. ఈ ప్రాజెక్టులో వారియర్ పాత్రలో కనిపించనుననట్లు తెలుస్తోంది. “Hunted. Wounded. Unbroken” అనే ట్యాగ్‌లైన్ సినిమా కథనం ఎంత ఉత్కంఠగా ఉండబోతుందో స్పష్టం చేసింది.
పుష్ప 2, ఛావా, సికందర్ సినిమాలతో అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కుబేర సినిమాతో మరో సక్సెస్ ఖాతాలో వేసుకుంది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రలలో కనిపించింది. ఇక ఎప్పటిలాగే ఈ చిత్రంలో తనదైన నటనతో ప్రశంసలు అందుకుంది రష్మిక. మరోవైపు గర్ల్ ఫ్రెండ్, రెయిన్, థామా చిత్రాల్లోనూ నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తాజాగా చిత్ర యూనిట్ ‘మైసా’ ప్రకటనతో రష్మిక చేతిలో భారీ ప్రాజెక్టు చేరింది.