Homebreaking updates newsBS.net న్యూస్ రౌండప్

BS.net న్యూస్ రౌండప్

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్:
➨భారతదేశం-అమెరికా మధ్య సుంకాల సమస్య రోజురోజుకూ జటిలం అవుతోంది. భారతదేశం సుంకాలను తగ్గించడానికి అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.

➨యాదాద్రిభువనగిరి: ఘనంగా కొనసాగుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.

➨తెలంగాణ మహిళ కమిషన్‌ను ఆశ్రయించిన సింగర్ కల్పన.

➨బిహార్: పోలీసులపై గుడుంబా బ్యాచ్ ఎటాక్..11మందికి గాయాలు.. బిహార్‌లోని పాలిగంజ్‌లో ఘటన

➨ఏపీ: గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో బీఈడీ ప్రశ్నపత్రం లీక్.. ముగ్గురు అరెస్ట్.

➨వరంగల్: ఛాతీకొప్పి..అదుపు తప్పి ఎస్సారెస్పీ కాల్వలోకి దూసుకెళ్లిన కారు..ముగ్గురు మృతి

➨బెంగళూరు: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటి రన్యారావుపై సీబీఐ కేసు.. దర్యాప్తు ముమ్మరం

➨విశాఖపట్నంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఓ హోటల్‌లో NRI మహిళ అనుమానాస్పద మృతి కలకలం సృష్టించింది.

➨ఆదిలాబాద్: జిల్లాలోని జందాపూర్ ఎక్స్ రోడ్డు ఘోర రోడ్డు ప్రమాదం..ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు..డ్రైవర్‌తోపాటు మరొకరు మృతి.

➨నాగర్ కర్నూల్: SLBC ప్రమాదం.. మనుషుల ఆనవాళ్లను గుర్తించిన కేరళ జాగిలాలు

➨ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో కొత్తగా రెండు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు, ఒకటి రాజధాని అమరావతిలో, మరొకటి శ్రీకాకుళంలో విమనాశ్రయాల నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.

➨ఆంధ్రప్రదేశ్: కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన కొణిదల నాగబాబు.
➨తెలంగాణ: మీరు హామీలిచ్చి మిమ్మల్ని నెరవేర్చమంటారా అని రేవంత్ రెడ్డి సర్కార్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్.

➨కరీంనగర్ నుంచి తిరుపతికి ప్రతీరోజూ రైలు నడపండి: మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు.

➨రాజకీయ వారసులను నిర్ణయించేది ఆంధ్రప్రదేష్ రాష్ట్ర ప్రజలే: మంత్రి నారా లోకేష్

➨నేడు భారత్-న్యూజిలాండ్ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్, మధ్యాహ్నం దుబాయ్‌లో ప్రారంభం కానుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments