భారత్ సమాచార్, సినీ టాక్స్ : సినిమా వాళ్లపై ఎప్పటికీ ఏవో రూమర్స్, గాసిప్స్ వస్తూనే ఉంటాయి. సినిమా వాళ్లంటే జనాలకు ఎంతో క్రేజ్ ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకుని సోషల్ మీడియాలో ఈ రూమర్స్ ను స్ప్రెడ్ చేస్తూ ఉంటారు కొందరు. వీటిని నిజాలా? అబద్ధాలా? అని నిర్ధారించుకోకుండానే షేర్ చేస్తుంటారు. వీటితో సినిమా తారలు ఎంతో క్షోభ అనుభవిస్తూ ఉంటారు. అయినా కూడా కొందరు తమ పైశాచిక ఆనందంతో రూమర్స్ పుట్టిస్తుంటారు.
మొన్నటికి మొన్న జ్యోతిక-సూర్య విడిపోతున్నారని కూడా తెగ రూమర్స్ పుట్టించారు. వాటిపై జ్యోతిక స్పందిస్తూ అలాంటిదేమి లేదని కూడా చెప్పేసింది. ఇలా హీరోలు, హీరోయిన్ల పర్సనల్ లైఫ్ గురించి పుకార్లు షికారు చేస్తుంటాయి. తాజాగా బాగా వైరలైన గాసిప్ మీనా పెళ్లి గురించే..
అందాల తార మీనా.. చిన్నప్పటి నుంచే సినిమాల్లో నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లోని దాదాపు అందరు అగ్రహీరోలతో నటించింది. అందరికీ సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చింది. మంచి అందం, అభినయం ఉండడంతో సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. ఆ తర్వాత సినిమాలు తగ్గించి ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంపిక చేసుకుంటూ ముందుకెళ్తోంది. ఈ క్రమంలో గతేడాది మీనా భర్త అనారోగ్యం చనిపోయిన విషయం మనకు తెలిసిందే. ఆయన చనిపోయిన కొద్ది రోజులకే మీనా మళ్లీ పెళ్లి చేసుకుంటోందని వదంతులు పుట్టించారు. ఇవి బాగా వైరల్ అయ్యాయి. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో మీనా మాట్లాడుతూ.. తనపై అనేక రూమర్స్ పుట్టించారని ఆవేదన చెందింది. భర్త చనిపోయిన బాధలో తమ కుటుంబం ఉందని.. తాను మళ్లీ పెళ్లిచేసుకోబోతున్నట్టు.. ధనుష్ తోనూ సంబంధం అంటగంటారని చెప్పింది. దీనిపై తమ కుటుంబం ఎంతో క్షోభను అనుభవించిందని చెప్పుకొచ్చింది. తాను ఇప్పట్లో పెళ్లిచేసుకోబోనని, కాకపోతే జీవితాంతం ఒంటరిగా మాత్రం ఉండనని తెలిపింది.