HomeUncategorizedఉద్యోగాల భర్తీపై త్వరలోనే రివ్యూ!

ఉద్యోగాల భర్తీపై త్వరలోనే రివ్యూ!

భారత్ సమాచార్, రాజకీయం : తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి ప్రధాన కారణం నిరుద్యోగులు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో నిరుద్యోగులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, లీకేజీలు, పరీక్షల రద్దు, ఫలితాల ప్రకటనలో ఆలస్యం.. వంటి సమస్యలతో నిరుద్యోగులు నైరాశ్యంలోకి వెళ్లారు. తమ భవిష్యత్ తో ఆడుకున్నా బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్ లేకుండా చేయాలని నిరుద్యోగులంతా గంపగుత్తగా కాంగ్రెస్ కు మద్దతు తెలిపి అధికారంలోకి తీసుకొచ్చాయి. అయితే ప్రమాణ స్వీకారం రోజే నిరుద్యోగులకు తీపి కబురు అందిస్తారని భావించినా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాక ఏ చర్యలు తీసుకోకపోవడంతో నిరుద్యోగులు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అయితే తాజాగా ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి రెండ్రోజుల్లో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిసింది. ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించి పూర్తి వివరాలతో సమీక్ష హాజరుకావాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ ను సీఎం కార్యాలయం ఆదేశించింది. దీంతో ఉద్యోగాల భర్తీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే నిరుద్యోగులు రెండు సంవత్సరాల విలువైన తమ సమయాన్ని కోల్పోయారని, వీలైనంత తొందరగా నోటిఫిేషన్లు జారీ చేయడంతో.. బీఆర్ఎస్ హయాంలో జరిపిన పరీక్షల ఫలితాలు వెల్లడి చేయాలని కోరుతున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పై సుప్రీం కోర్టులో కేసు ఉందని, దానిపై ప్రభుత్వం ఏవిధంగా ముందుకెళ్తుందో తేల్చాలంటున్నారు. అలాగే గ్రూప్-2పై కూడా నిర్ణయం తీసుకోవాలన్నారు. ఏదేమైనా తొందరగా నోటిఫికేషన్లు జారీ చేయడం, ఎగ్జామ్స్ పెట్టడం, ఫాస్ట్ గా ఫలితాలు ఇవ్వడంపై దృష్టి పెట్టాలని నిరుద్యోగులు సూచిస్తున్నారు.

మరికొన్ని కథనాలు…

‘కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే’

RELATED ARTICLES

Most Popular

Recent Comments