భారత్ సమాచార్.నెట్, మహరాష్ట్ర: ఒక్క హత్య చేసుకోవడానికి మహిళకు హక్కు ఉండాలని .. ఎలాంటి శిక్షలు కూడా ఉండకూడదన్న డిమాండ్ ను ఓ మహిళా నేత తెరపైకి తెచ్చారు. మహారాష్ట్రలో శరద్ పవార్ పార్టీకి చెందిన రోహిణి ఖడ్సే ఈ మేరకు నేరుగా రాష్ట్రపతికి లేఖ రాశారు. మహిళా దినోత్సవం రోజున ఆమె లేఖ వెలుగులోకి వచ్చింది. మహిళలపై అరాచకాలు పెరిగిపోతున్నాయని వాటిని అడ్డుకోవడానికి ఈ అవకాశం ఉండాల్సిందేనని ఆమె వాదిస్తున్నారు. ఈమె మాజీ మంత్రి ఏక్ నాథ్ ఖడ్సే కుమార్తె.
సమాజం సమాధానం చెప్పగలదా..?
రాష్ట్రపతికి రాసిన లేఖలో దేశంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. చారిత్రక అంశాలను ప్రస్తావించి మహిళలు తమ గౌరవం కాపాడుకోవడం హత్యలు చేశారన్నది విషయాన్ని గుర్తు చేశారు. చరిత్రలో చాలా మంది మహిళలు తమ సామ్రాజ్యాల్ని కాపాడుకోవడానికి కత్తుల్ని పట్టుకున్నారని ఉన్నారు. ప్రస్తుతం బాధితులుగా మారిన తర్వాత జాలి చూపిస్తున్నారు కానీ న్యాయం జరగడం లేదని రోహిణి చెబుతున్నారు. చిన్నారులపై అఘాయిత్యాలు ఎందుకు జరుగుతున్నాయో సమాజం సమాధానం చెప్పగలదా అని ఆమె ప్రశ్నించారు.
రోహణి ఖడ్సే ఆవేదనలో అర్థం ఉంది.. సమాజంలో జరుగుతున్నది కూడా అదే. అయితే మహిళలు వేధించడం లేదని ఎవరూ చెప్పడం లేదు. ఇటీవలి కాలంలో మహిళా వేధింపులకు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయం పక్కన పెడితే ఎంత రక్షణకు అయితే మాత్రం హత్య చేసే హక్కును కూడా అడగడం కాస్త విచిత్రంగానే ఉంటుంది. అందుకే చర్చనీయాంశం అవుతోంది.
మరిన్ని కథనాలు: