Homebreaking updates newsసూపర్ మార్కెట్ కు రూ.35 వేల జరిమానా

సూపర్ మార్కెట్ కు రూ.35 వేల జరిమానా

భారత్ సమాచార్, జాతీయం ;

ఎక్స్పైరీ అయిన టాల్కమ్ పౌడర్ ను ఎమ్మార్పీ రేట్ కు మించి అమ్మిన ఓ సూపర్ మార్కెట్ యాజమాన్యం కి ఉమ్మడి నెల్లూరు జిల్లా వినియోగదారుల కోర్టు న్యాయమూర్తి రూ.35 వేలు జరిమానా విధించారు. కేసు పూర్తి వివరాల్లోకి వెళితే నెల్లూరు కు చెందిన బీటెక్ విద్యార్థి 2022 సెప్టెంబరు 15న ఓ సూపర్ మార్కెట్ లో పాండ్స్ పౌడర్ ను కొనుగోలు చేశాడు. 2022 సెప్టెంబరు 20 న పౌడర్ ను వాడిన గంట వ్యవధిలోనే మొహం పై రాషెస్, దద్దుర్లు రావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. వైద్యుడు పరీక్షించి ఎక్స్పైరీ అయిన టాల్కమ్ పౌడర్ ను వాడడం వలనే మొహంపై దదర్లు వచ్చుంటాయని చెప్పడంతో పౌడర్ డబ్బాను గమనించగా ఆ పౌడర్ ఆగస్టు 2021 లోనే ఎక్స్పైరీ అయిపోయింది.. పైగా పౌడర్ డబ్బా పై ఎమ్మార్పీ ధర రూ.75 ఉండగా సూపర్ మార్కెట్ రూ.84 కు అమ్మింది.. దీంతో భాధితుడు నెల్లూరు జిల్లా వినియోగదారుల కోర్టు ను ఆశ్రయించారు. కేసును విచారించిన న్యాయమూర్తి ఆధారాలను పరిశీలించాక ఎక్స్పైరీ అయిన పాండ్స్ టాల్కమ్ పౌడర్ ను.. ఎమ్మార్పీ రేట్ కు మించి అమ్మారని, పౌడర్ వాడడంతో భాధితుడి మొహం పై ఎర్రటి రషెస్, దద్దుర్లు వచ్చినట్లు నిర్ధారించారు. తీర్పు ను వెలువరిస్తూ ఆయన రిటైలర్ పాత్ర అత్యంత ముఖ్యమైనదన్నారు.

వినియోగదారుడికి, రిటైలర్ కు ప్రత్యక్ష సంబంధం ఉన్నందున రిటైలర్ వస్తువులను సరఫరా చేసే ముందు, వాటి నాణ్యత, గడువు తేదీ మొదలైన వాటికి సంబంధించి నిర్ధారించుకోవాలన్నారు. అయినప్పటికీ, అనుకోకుండా పొరపాటు జరిగితే మరియు వినియోగదారుడు ఫిర్యాదుతో అతని వద్దకు వచ్చినప్పుడు రిటైలర్ దానిని అంగీకరించాలని. రిటైలర్ మొదటిగా అటువంటి వస్తువులను తిరిగి తీసుకొని, ఖర్చును తిరిగి వినియోగదారుడికి ఇవ్వాలన్నారు. వినియోగదారుడు పరిహారం క్లెయిమ్ చేస్తే, రిటైలర్ కొంత సమయం ఇవ్వాలని అభ్యర్థించవచ్చు, తద్వారా అతను హోల్ సేల్ వ్యాపారి మరియు తయారీదారుతో సమస్యను పరిష్కరించవచ్చు. వినియోగదారుడికి అటువంటి మర్యాద చూపకపోతే.. లోపభూయిష్ట వస్తువులను సరఫరా చేయడానికి మరియు కొనుగోలుదారుకు మానసిక మరియు శారీరక వేదన కలిగించడానికి ప్రధానంగా రిటైలర్ బాధ్యత వహిస్తాడని తెలిపారు. భాడితుడికి రూ.35 వేలు పరిహారం చెల్లించాలని తీర్పు వెలువడిన 45 రోజుల్లోపు చెల్లించాలని రిటైలర్ సూపర్ మార్కెట్ ను ఆదేశించారు. ఆలస్యం అయిన పక్షంలో తీర్పు వెలువడిన తేది నుంచి 9 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు.

మరికొన్ని వార్తా కథనాలు…

ఆషాడ మాసంలో అంబానీ పెళ్లి…

RELATED ARTICLES

Most Popular

Recent Comments