భారత్ సమాచార్, హైదరాబాద్ ; అందరూ ఊహించినట్టే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేడు అధికారికంగా గులాబీ పార్టీ గూటికి చేరుకున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గులాబీ కండువా కప్పి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ను గులాబీ పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటుగా పెద్ద ఎత్తున బీఎస్పీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రవీణ్ కుమార్ అభిమానులు కూడా కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో భారతీయ రాష్ట్ర సమితి పార్టీ తరపున ప్రవీణ్ కుమార్ ఎంపీ గా పోటీ చేయనున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ కి ఎంపీ సీటు ను ఆఫర్ చేశారని అందుకు ఈ మాజీ ఐపీఎస్ అధికారి కారు ఎక్కినట్టు సమాచారం. అయితే గులాబీ నాయకుడు ఏ సీటును కేటాయిస్తారో మాత్రం ఇప్పటికి సస్పెన్స్ గా మారింది.
గులాబీ గూటికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RELATED ARTICLES