Homemain slides‘మాయవన్’టీజర్ రిలీజ్

‘మాయవన్’టీజర్ రిలీజ్

భారత్ సమాచార్, సినీ టాక్స్ ;

చాలా గ్యాప్ తర్వాత వీ ఐ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన సోషియో ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం ‘ఊరిపేరు భైరవకోన’ మూవీతో ఒక హిట్ ను ఖాతాలోకి వేసుకున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. దీంతో ఈ సారి అదే నిర్మాణ సంస్థలో ఒక స్కైఫై యాక్షన్ అడ్వంచర్ సినిమా ‘మాయవన్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా ‘మాయవన్’టీజర్ ను నెట్టింట విడుదల చేశారు దర్శకనిర్మాతలు.

టీజర్ లో ప్రముఖ నటుడు మురళీ శర్మ చెప్పే ‘‘ ఒక్క సారి పురాణాలను దాటొచ్చి చూస్తే… తనకు తాను దేవుడిగా భావించిన ప్రతి మనిషి మారింది రాక్షసుడిగా మాత్రమే…, ఇలాంటి రాక్షసుడు పుట్టుకొచ్చిన ప్రతి సారి…, దేవుడు పంపేది, మొండితనాన్ని ఆయుధంగా మార్చుకొని పోరాడే ఒక సామాన్యుడు ’’ డైలాగ్స్ ఇంప్రెసివ్ గా ఉన్నాయి. టీజర్ ఆసాంతం చాలా ఆసక్తికరంగా సాగింది. అత్యున్నత సాంకేతికత విలువలతో భారీ యాక్షన్ సీక్వేన్స్ ని డిజైన్ చేశారు. ఈ మూవీని సందీప్ కిషన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. సీ వీ కుమార్ దర్శకుడు. ‘కబాలి’మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ దీనికి సంగీత దర్శకుడు. అనిల్ సుంకర నిర్మాత. ఈ సైంటిఫిక్ మూవీని ఈ ఏడాది చివరి లోపల ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మరికొన్ని సినీ సంగతులు…

‘లీడర్’ మూవీ రీరిలీజ్

RELATED ARTICLES

Most Popular

Recent Comments