భారత్ సమాచార్, ఆధ్యాత్మికం ;
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడి బ్రహోత్సవాలకు టీటీడీ అధికారులు తాజాగా షెడ్యూల్ ను విడుదల చేశారు. ఈ ఏడాది శ్రీవారి బ్రహోత్సవాలను అక్టోబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ ఏడాదిలో అధిక మాసం లేదు కాబట్టి సాలకట్ల బ్రహోత్సవం (సాలకట్ల అంటే వార్షికం)మరియు నవరాత్రి బ్రహోత్సవాలు కలిపి ఒకే బ్రహోత్సవం మాత్రమే నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
తిరుమల బ్రహ్మోత్సవం షెడ్యూల్ :
3 అక్టోబర్ 2024 – గురువారం రాత్రి: 7 నుండి 8 వరకు – అంకురార్పణ, విశ్వక్సేన ఆరాధన
4 అక్టోబర్ 2024 – శుక్రవారం – మొదటి రోజు
మధ్యాహ్నం: 3.30 నుండి 5.30 వరకు బంగారు తిరుచ్చి ఉత్సవం. సాయంత్రం సుమారు 6 గంటలకు ద్వజారోహణం (ధ్వజారోహణం). రాత్రి: 9 గంటల నుండి 11 గంటల వరకు పెద్ద శేష వాహనం.
5 అక్టోబర్ 2024 – శనివారం – రెండవ రోజు
ఉదయం: 8 నుండి 10 వరకు – చిన శేష వాహనం. మధ్యాహ్నం 1 గంటల నుండి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం (ఉత్సవర్లకు అభిషేకం). రాత్రి: 7 నుండి 9 గంటల వరకు – హంస వాహనం.
6 అక్టోబర్ 2024 – ఆదివారం మూడవ రోజు
ఉదయం 8 నుండి 10 వరకు సింహవాహనం. మధ్యాహ్నం 1 గంటల నుండి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం (ఉత్సవర్లకు అభిషేకం). రాత్రి: 7 గంటల నుండి 9 గంటల వరకు ముత్యాల పల్లకీ వాహనం (ముత్యపు పందిరి వాహనం).
7 అక్టోబర్ 2024 – సోమవారం నాలువ రోజు
ఉదయం 8 నుండి 10 వరకు కల్పవృక్ష వాహనం. సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు సర్వభూపాల వాహనం.
8 అక్టోబర్ 2024 మంగళవారం ఐదవ రోజు
ఉదయం 8 నుండి 10 వరకు మోహినీ అవతారం. రాత్రి సుమారు 7 గంటల నుండి 12 గంటల వరకు గరుడ వాహనం.
9 అక్టోబర్ 2024 – బుధవారం -ఆరవ రోజు
ఉదయం 8 నుండి 10 వరకు హనుమంత వాహనం. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు స్వర్ణ రథోత్సవం (స్వర్ణ రథం). రాత్రి: 7 గంటల నుండి 9 గంటల వరకు గజవాహనం.
10 అక్టోబర్ 2024 – గురువారం ఏడవ రోజు
ఉదయం 8 నుండి 10 గంటల వరకు సూర్య ప్రభ వాహనం. మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం (ఉత్సవర్లకు అభిషేకం). రాత్రి: 7 గంటల నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం.
11 అక్టోబర్ 2024 – శుక్రవారం ఎనిమిదవ రోజు
ఉదయం 6 గంటలకు రథోత్సవం (రథం, రథోత్సవం). సాయంత్రం: 7 గంటల నుండి 9 గంటల వరకు – అశ్వవాహనం.
12 అక్టోబర్ 2024 – శనివారం తొమ్మిదవ రోజు
తెల్లవారుజామున 3 నుండి 6 గంటల వరకు పల్లకీ ఉత్సవం & తిరుచ్చి ఉత్సవం. ఉదయం 6 నుండి 9 వరకు – స్నపన తిరుమంజనం, చక్రస్నానం.