Homebreaking updates news‘ఎన్నికల సమరానికి సేనాని సై’...టార్గెట్ గోదావరి జిల్లాలే

‘ఎన్నికల సమరానికి సేనాని సై’…టార్గెట్ గోదావరి జిల్లాలే

భారత్ సమాచార్, రాజకీయం : ఏపీలో ఎలక్షన్ ఫీవర్ మంచి హీట్ మీద ఉంది. అధికార పార్టీ ‘సిద్ధం’ అంటూ సీఎం జగన్ తో భారీ సభలు నిర్వహించుకుంటూ ప్రజల్లోకి వెళుతోంది. ఇక ప్రధాన ప్రతిపక్షం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ తో ఎన్నికల ‘శంఖారావం’ పూరించి పెద్ద ఎత్తున సభలు నిర్వహిస్తోంది. నారా లోకేష్ తో డైరెక్ట్ గా ప్రజల్లో ఇంటరాక్ట్ అవ్వటానికి అవకాశం కల్పిస్తోంది. ప్రజాగళం అంటూ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రజా సమస్యలతో పాటుగా, పార్టీ కార్యకర్తలను కూడా సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి వెళుతున్నారు.  కానీ జనసేన అధినేత మాత్రం ఇక పూర్తి స్థాయిలో ఎన్నికల సమరంలోకి దూకలేదని కింది స్థాయి కేడర్ నుంచి పార్టీ నాయకులు సైతం పెదవి విరుస్తున్నారు. దీనికి సమాధానంగా ‘ఎన్నికల సమరానికి సేనాని సై’ అంటూ ఫిబ్రవరి 14 నుంచి ప్రజల్లోకి వెళుతున్నాడు జనసేనాని.

ఉభయ గోదావరి జిల్లాలను కంప్లీట్ గా టార్గెట్ చేస్తూ 3 దశలలో ఎన్నికల ప్రచారం చేపట్టినట్టు అధికారికంగా జనసేన నాయకులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ నెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నిర్వహించబోయే సభల మొదటి షెడ్యూల్ ను విడుదల చేశారు. తొలి రోజు భీమవరంలో నిర్వహించే సమావేశాలలో పాల్గొంటారు. అనంతరం అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలలో సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు.

మొదటి దశలో పార్టీ నాయకులతో స్థానిక రాజకీయాలపై మంతనాలు జరుపుతారు. 2వ దశలో స్థానిక కార్యకర్తలతో పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం ఎలా చేయాలి అనే అంశం పై లోతుగా చర్చిస్తారు. 3వ దశలో భారీ స్థాయి బహిరంగ సభలు ఏర్పాటు చేస్తారు. మొత్తంగా ఎన్నికల ప్రచారం మొదలయ్యే సమయానికి పోటీ చేసే ప్రతి నియోజకవర్గంలోనూ 3 సార్లు పర్యటించేలా ప్రణాళికలు రచిస్తున్నారు జనసేన వ్యూహకర్తలు. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపులు అత్యధికంగా ఉండే నియోజకవర్గాల్లో క్లీన్ స్వప్ యే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ సీనియర్ నాయకులు, కాపు ఉద్యమ నాయకులు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.

మరికొన్ని రాజకీయ కథనాలు…

జిత్తుల మారి పొత్తుల కథ ఇది…

RELATED ARTICLES

Most Popular

Recent Comments