Homemain slidesకోటి మందికి చేరువలో సర్వర్ క్రాష్...

కోటి మందికి చేరువలో సర్వర్ క్రాష్…

భారత్ సమాచార్, చెన్నై ;

తమిళనాట వెండితెరపై నుంచి వచ్చి రాజకీయాల్లో చక్రం తిప్పిన వారు ఉన్నారు. బొక్క బోర్ల పడ్డ వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో దళపతి విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) పెను సంచలనం సృష్టిస్తోంది. మొదటి పార్టీ మీటింగ్ వేరే లెవల్ లో హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే తమిళ రాజకీయాల్లో పాతుకొని పోయి ఉన్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు నాయకులు ఏ పార్టీ ఓట్లు చీలుతాయో అనుకుంటూ తలలు పట్టుకొని కూర్చున్నారు. మరోవైపు తమిళ యువత పెద్ద ఎత్తున విజయ్ పార్టీలో వాలంటీర్ గా చేరుతున్నారు. ఇటీవల పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభించిన టీవీకే పార్టీ లో మోజార్టీ శాతం యువతే సభ్యత్వం పొందారు. ఇప్పటి వరకు 90 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు. కోటికి చేరువలో ఉన్న సమయంలో టెక్నికల్ ప్రాబ్లం కారణంగా సర్వర్ క్రాష్ అయినట్టు పార్టీ కార్యాలయం పేర్కొంది.

కాగా టీవీకే అధినేత విజయ్ తమిళనాట భారీ స్థాయిలో పాదయాత్ర ను కూడా ప్లాన్ చేస్తున్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది. ఇదే కనుక నిజం అయితే తమిళనాట పాదయాత్ర చేయబోతున్న తొలి రాజకీయ నాయకుడిగా విజయ్ నిలుస్తాడు. మరో వైపు సర్వర్ క్రాష్ అవ్వటంపై పార్టీ అధికార వర్గాలు స్పందించాయి. పెద్ద ఎత్తున ఓటర్ల సభ్యత్వ నమోదుకు ముందుకు రావటంతో వెబ్ సైట్, యాప్ క్రాష్ అయ్యాయి. మరికొద్ది రోజుల్లోనే టెక్నికల్ ప్రాబ్లమ్ ని క్లియర్ చేసి వీటిని మళ్లీ ప్రజల ముందుకు మళ్లీ తీసుకొస్తామని తెలిపారు.

మరికొన్ని వార్తా విశేషాలు...

బాధితురాలి నుంచి బ్రాండ్ అంబాసిడర్ గా…

RELATED ARTICLES

Most Popular

Recent Comments