Homeజాతీయంటైమ్స్ నౌ సర్వేలో బీఆర్ఎస్ కు షాక్

టైమ్స్ నౌ సర్వేలో బీఆర్ఎస్ కు షాక్

భారత్ సమాచార్, రాజకీయం :  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి కూడా కచ్చితంగా అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా నమ్మకంగా ఉండేవారు. పింఛన్ దారులు, రైతులు, వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల మద్దతుతో ఈజీగా ఎలక్షన్ లో హ్యాట్రిక్ కొడుతామని అంచనా వేశారు. కానీ ఉద్యోగులు, నిరుద్యోగుల ఫుల్ సపోర్ట్ తో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసింది. మరో మూడు నెలల్లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో అయినా బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు కూడా భావిస్తున్నాయి.

రీసెంట్ గా ప్రముఖ జాతీయ సంస్థ టైమ్స్ నౌ-ఈటీజీ సంస్థ సర్వేలో మాత్రం షాకింగ్ ఫలితాలు వచ్చాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో అని ఆ సర్వే వెల్లడించింది. ఈ సర్వేలో చాలా అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ఈ సంస్థ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేసింది. దాదాపు అవే ఫలితాలు రావడంతో ఆ సర్వే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఏ పార్టీకి ఎన్ని సీట్లు:

బీఆర్ఎస్: 3-5
కాంగ్రెస్: 8-10
బీజేపీ: 3-5
ఇతరులు: 01

ఈ సర్వే అంచనాల ప్రకారం తెలంగాణలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8-10 సీట్లు సాధిస్తుందని తెలుస్తోంది. రాష్ట్రంలో ఆ పార్టే అధికారంలో ఉండడంతో ఎక్కువ లోక్ సభ సీట్లు గెలవటానికి స్కోప్ ఉంటుందని ఆ సర్వే చెపుతోంది. ఆ పార్టీ పెద్దలతో పాటు స్టేట్ కు సంబంధించి రేవంత్ సహ సీనియర్లు ప్రచారంలో ఉండనున్నారు. ఇక బీజేపీ గతంలో 4 సీట్లు గెలుచుకున్నా.. ఈ సారి కూడా దాదాపు అన్నే సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోందని సర్వే వెల్లడించింది. ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 9 సీట్లకే పరిమితం కావడం.. పార్టీ ప్రముఖులంతా ఓడిపోవడం కూడా ఆ పార్టీకి కొంచెం మైనస్ కానుంది. ఇక పార్టీ జాతీయ నాయకులు కూడా తెలంగాణపై పెద్దగా నజర్ వేసే పరిస్థితిలేదు.

మరికొన్ని కథనాలు…

జీరో కరెంటు బిల్లు రావటం లేదా..?

RELATED ARTICLES

Most Popular

Recent Comments