భారత్ సమాచార్, ఫిలాసఫీ ;
ఒకరికి నచ్చేలా ఉండాలని నటించకు ఎందుకంటే, ఎదుటివారికి నచ్చేలా ఉండటానికి ఇది నాటకం కాదు.!! “జీవితం”.!!
జీవితంలో నిజాయితీగా ఉండండి నచ్చిన వాళ్ళు నీతో ఉంటారు. నచ్చని వారు నీ నుండి దూరంగా వెళ్ళిపోతారు. జీవన ప్రయాణంలో ఎవరికి ఎవరు శాశ్వతం నీకు. నీకు నీవేగా,నీవు గా ప్రయాణించాలి.
ఎవరి కోసమో నీ నిజమైన స్వభావాన్ని వదిలిపెట్టకు. నువ్వు నువ్వు లా ఉండు. వేరొకడిల ఉండాలని వారిని కలలో కూడా అనుకరించకు…
ఒక పులి తన స్వభావాన్ని వదిలి గడ్డి మెయ్యదు. ఒక సింహం తమ స్వభావాన్ని వదిలి పిల్లిలా అరవదు. దాని స్వభావం గర్జించడమే..అలాంటిది నీ స్వభావాన్ని ఎలా మార్చుకుంటావు..?
మూర్ఖులతో వాదించకండి అది బురద అని తెలిసి కూడా బురదలో రాయి వేస్తే ఏమౌతుంది..? బురద మొత్తము మన ముఖంపై వస్తుంది.. అలాగే,మూర్ఖులకు వాదించడం మాత్రమే తెలుసు కానీ, వారిలో ఎలాంటి మ్యాటరుండదు. మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి.. కానీ, నీవు ఎవరిని పట్టించుకోకుండా టీవీ గా నడుస్తూ వెళ్ళిపోవాలి..
మనుషులను ద్వేషించకండి కానీ,మనిషి మనసులో ఉన్న దుష్ట గుణాలను ద్వేషించండి.
ఒకరి బలహీనత మన బలం కాకూడదు. ఒకరి మంచితనం చేతగానితనంగా భావించకూడదు.
అలాంటప్పుడు నిరాశ, నిస్ప్రుహ్హలను వదిలిపెట్టి.ఎవరు ఏది ఇచ్చినా…మనఃస్ఫూర్తిగా స్వీకరించండి.!
ఇచ్చిన వారిని మనస్సులో దాచుకోండి. ఎప్పటికైనా వారికి వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలి కదా.!!
అది సహాయమైనా..సహకారమైనా…బాధ అయినా…నమ్మకద్రోహం అయినా…ప్రేమైనా… ఏది ఉంచుకోవద్దు. కాస్త లేటైన ఏదో ఒక రోజు వడ్డీతో సహా చెల్లించండి.