భారత్ సమాచార్, క్రీడలు ;
దక్షిణాఫ్రికా క్రీడాభిమానుల మనస్సులు ఉప్పొంగిన రోజు ఇది. ఈ రోజుని సౌత్ ఆఫ్రికా మరో శతాబ్దం పాటు గుర్తు పెట్టుకుందేమో.ప్రపంచ క్రికెట్ లో ఇప్పటి వరకు తొమ్మిది సార్లు సెమీ ఫైనల్స్ ఆడిన సౌత్ ఆఫ్రికా జట్టు మొట్ట మొదటి సారిగా దర్జాగా, ధీమాగా టీ20 2024 వరల్డ్ కప్ ఫైనల్స్ లోకి అడుగు పెట్టింది. ఆప్ఘనిస్తాన్ తో జరిగిన మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. ఈ నెల 29వ తేదీన రెండో సెమీ ఫైనల్స్ లో గెలిచిన జట్టు పై మెగా ఫైనల్ మ్యాచ్ ను ఆడనుంది దక్షిణాఫ్రికా.
ఇంటర్నేషనల్ క్రికెట్ టీ20 ఫార్మాట్ అంటేనే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. అటువంటి సంచలనాలకు మించిన ట్వీస్ట్ లను అందించింది టీ20 2024 వరల్డ్ కప్. ఇందులో మాజీ ఛాంపియన్ దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు సెమీస్ కి కూడా చేరకుండానే ఇంటి ముఖం పట్టాయి. పాకిస్తాన్ అయితే లీగ్ దశలోనే ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఈ వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ మొదటి సారి సెమీస్ కు చేరింది. అమెరికా పాకిస్తాన్ ను ఓడించి సూపర్-8 వరకు చేరుకుంది.
నేడు రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ తో ఇంగ్లాడ్ జట్టు రాత్రి 8 గంటలకు వెస్టీండీస్ లోని గయానా లో తలపడనుంది.