Homebreaking updates newsమూత్రాన్ని నీటిగా మార్చే స్పేస్ షూట్

మూత్రాన్ని నీటిగా మార్చే స్పేస్ షూట్

భారత్ సమాచార్, ఏఐ న్యూస్ ;

ఆధునిక సాంకేతికత సాయంతో శాస్త్రవేత్తలు అధ్బుత ఆవిష్కరణలు సృష్టిస్తున్నారు. అమెరికాలోరని కార్నెల్ విశ్వ విద్యాలయంలోని శాస్త్రవేత్తలు సరికొత్త ఆవిష్కరణ చేశారు. మూత్రాన్ని 5 నిమిషాల్లో ఫిల్టర్‌ చేసి నీటిగా మార్చేసే స్పేస్‌ సూట్లను తయారుచేశారు. వెయిల్‌ కార్నెల్‌ మెడిసిన్‌కు చెందిన సోఫియా ఎత్లిన్‌ ఈ స్పేస్‌ సూట్‌ను రూపొందించారు. ఇందులో మూత్రాన్ని సేకరించేందుకు వ్యోమగాములకు ఒక కలెక్షన్‌ కప్‌ను జననేంద్రియాల వద్ద ఏర్పాటు చేస్తారు. మూత్రవిసర్జన చేయగానే స్పేస్‌సూట్‌లో మూత్రం ఫిల్టర్‌ అవ్వటం ప్రారంభమవుతుంది. అందులో ఉన్న ఫిల్టర్ సాయంతో ఐదు నిమిషాల్లో మూత్రం నీటిగా మారుతుంది. అక్క 2025 నాటికి ఇది అందుబాటు లోకి రానున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ ఆవిష్కరణ సాయంతో అంతరిక్ష ప్రయాణికులకు చాలా సౌలభ్యంగా ఉంటుందని వారు భావిస్తున్నారు. అంతరిక్షంలో వ్యోమగాములు సుదూర కాలం, సూదూర ప్రాంతానికి వెళ్లటానికి ఈ ఆవిష్కరణ ఎంత గానో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

మరి కొన్ని తాజా వార్తా విశేషాలు…

ఫోన్ పేలో ఫ్రీగా క్రెడిట్ స్కోర్.. ఇలా చెక్ చేసుకోండి

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments