Homemain slidesరక్తాన్ని తిన్న చీము...

రక్తాన్ని తిన్న చీము…

భారత్ సమాచార్, ‘అక్షర’ ప్రపంచం ;

అది ఒక అమావాస్య అర్ధరాత్రి… ఊరి చివర ఒక అందమైన శవం చాలా సుఖంగా నిద్రపోతోంది. ఊరిలో ఉండే జనాలు అందరూ నగ్నంగా అక్కడ ఉన్న గుంతలోని నెత్తురు నీళ్లు పోసుకుంటూ చిందులు వేస్తున్నారు. వారిలో కొంతమంది బాగా ఎరుపెక్కిన నెత్తురు తాగుతూ…ఊగుతున్నారు. ఒకడు తాడుతో ఒక మగ గాడిదని పట్టుకొచ్చాడు. మరొకడు తన భుజాల మీద ఒక ఆడ పందిని మోసుకొచ్చాడు. వాటిని చూస్తున్న ఊరి జనాలు కేరింతలు కొడుతున్నారు. అక్కడ జరుగబోయే ఘట్టానికి సన్నాహాలు చేయటానికి ఒక పెద్ద బండరాయికి మగాళ్లు అందరూ పసుపు, కుంకుమ రాస్తున్నారు. అప్పటి వరకు అక్కడే ఉండి ఈ తంతును చూస్తున్న ఆడవాళ్లు అందరూ నెమ్మదిగా లేచి వాళ్ల, వాళ్ల గుడిసెల్లోకి వెళుతున్నారు. సుందరమ్మ చెంబు నెత్తురు నోట్లో పోసుకొని పుక్కిలించి వెళుతోంది. బండరాయి దగ్గర ఉన్న రాము గాడు..‘‘ ఇంకా ఈ ఎదవ గోల ఏంటి రా, తొందరగా జరపండి. ఒక్కతే ఆడది అక్కడ అలా పడి ఉంటే, ఎవరైనా, ఏమైనా చేయరా..దాన్ని ’’ పందికి నీళ్లు పోస్తున్న సుబ్బడు…‘‘ రేయ్ ముసలోడా, అది సచ్చింది దాన్ని ఏం చేస్తారు? ’’. రాము, చుట్ట నోట్లో పెట్టుకొని నడుచుకుంటూ వచ్చి సుబ్బి గాడిని ఎడమ కాలితో తన్ని…‘‘ ముందు నువ్వు పందిని శుభ్రంగా కడగటం నేర్చుకో రా, అది బతికున్నప్పుడు గూడెం వాళ్లు మొత్తం దాని చుట్టూనే తిరిగారు. ఇప్పుడు అది సచ్చింది, కనీసం ఒక్కడైనా దాని మీద మనసు పడకపోతాడంటావా? దాన్ని ఎత్తుకుపోయేదానికి ఒక్కడు కూడా ఉండడంటావా? నేను దాని దగ్గర కాపలా ఉంటాను, మీరు ఇక్కడ కార్యం చేసుకొని తొందరగా రండి రా…’’.

గుడిసెళ్లోకి వెళ్లిన ఆడోళ్లు అల్లం, వెల్లులి రోట్లో వేసి నూరుతున్నారు. అందరి ముఖాల్లో నవ్వులు కనిపిస్తున్నాయి. బండరాయి దగ్గర గాడిదకి, పందికి పెళ్లి చేస్తున్నారు. మగ గాడిద ఆనందంతో ఓండ్ర పెడుతోంది. భయంతో బుజ్జి పంది తల కిందికి ఒంచుకొని చూస్తోంది. కొమ్ముబుర్ర ఊదుకుంటూ రాముగాడు శవం చుట్టూ తిరుగుతున్నాడు . ‘‘చూడవే ముచ్చమ్మ నీ పెళ్లి ఎలా జరుగుతుందో… నీకు గుర్తు ఉందా, పోయిన యేడాది నువ్వు నవ్వితే మనూరు మీదకి రాజులూ వచ్చి నిన్ను ఎత్తుకెళ్లి ఏం చేశారో నీకు తెలుసుగా, అంతకు ముందు యేడాది నువ్వు ఒకడితో లేచిపోతే, ఆ తర్వాత నిన్ను ఏం చేశారో తెలుసుగా, అంతకుముందు ముందు యేడాది నువ్వు నడుస్తుంటే నీ వెనుక పరుగులు తీసిన మగ కుక్కలు ఎన్నో నీకు తెలుసుగా, అందులో నేను కూడా ఉన్నా అనుకో… మొత్తానికి నువ్వు పొయావు ఊరు అంత ఒంటరి అయిపోయింది.’’ అంటూ అక్కడే కూర్చొని ముచ్చమ్మ వైపే చూస్తున్నాడు రాముగాడు.

మగగాడిద ముందు నడుస్తోంది..దాని వెనుక భయం, భయంగా బుజ్జి పంది నడుస్తోంది… దాని వెనుక ఒక ఊరు ఊరే నడుస్తోంది… నెత్తురు చిందులు వేస్తూ ,కేరింతలు కొడుతూ, ఊరి చివర ఉన్న ముచ్చమ్మ శవం చుట్టూ అందరూ చేరి అరుస్తున్నారు. ‘‘ రేయ్ కాలం నడుస్తోంది, అర్ధరాత్రి రెండు అయింది. వెళ్లి కట్టెలు పోగేయండి’’ కొందరు కట్టెలు తెచ్చి పోగేస్తున్నారు. ‘‘ రేయ్, ఇంక టైమ్ అయిపోయింది లే కాని, ఆ గాడిద తల నరిక్కేయండి’’ అంటూ రాముడు పందిని ఎత్తుకున్నాడు. గొడ్డలి వేటుతో గాడిద కుప్పకూలింది. నెత్తురు చిమ్ముతూ ముచ్చమ్మ మీదకి చిమ్మింది. రాముడు పందిని నేలమీద దించాడు. ఊరి జనాలంతా మొగుడుపోయిన ముండా అంటూ ఆ పందిని రాళ్లతో కొడుతూ కేరింతలు కొడుతున్నారు . ఒక వైపు కట్టెల మంటల్లో ముచ్చమ్మ భస్మం అవుతోంది.
మరోవైపు గాడిద మాంసాన్ని పోగులు చేసుకుంటు భాగాలు పంచుకుంటున్నారు. ఊరిలో ఆడోళ్లు మాంసం కోసం ఎదురు చూస్తున్నారు. దెబ్బతిన్న మనస్సుకి ఏ మార్గమైన ఒక్కటే…

‘‘బ్రతికితే చాలురా దేవుడా ఈ పాడు కథలు రాసుకుంటూ జీవించేస్తా ’’

ఇట్లు
రామ్ యలగాల
8019202070

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

పండుగ పూట కూడా పాత…

RELATED ARTICLES

Most Popular

Recent Comments