Homebreaking updates newsప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం

ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం

భారత్ సమాచార్.నెట్, శ్రీలంక: భారత్ ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)ని శ్రీలంక (SriLanka) ప్రభుత్వం అత్యున్నత పురస్కారాన్ని ప్రధానం చేసింది. ద్వీపదేశ అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే (President Anura Kumara Dissanayake) “శ్రీలంక మిత్ర విభూషణ” (Sri Lanka Mitra Vibhushana) పురస్కారాన్ని అందజేశారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసినందుకు ప్రధాని మోదీకి ఈ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. శ్రీలంక అత్యున్నత పౌర పురస్కారం లభించిన సందర్భంగా.. ప్రధాని మోదీ శ్రీలంక అధ్యక్షుడు దిస్సనాయకుకు కృతజ్ఞతలు తెలుపుతూ.. ఈ గౌరవాన్ని 140 కోట్ల మంది భారతీయులకు అంకితం చేశారు.

శ్రీలంక మిత్ర విభూషణ్ పురస్కారంలోని ధ‌ర్మ చ‌క్రం ఇరు దేశాల సాంస్కృతిక సంప్రదాయాల‌ను ప్రతిబింబిస్తుంది. మ‌ధ్యలో ఉండే క‌ల‌శం శ్రేయ‌స్సును, తొమ్మిది విలువైన ర‌త్నాలు ఇరు దేశాల మ‌ధ్య శాశ్వత‌మైన స్నేహాన్ని సూచిస్తే.. సూర్యుడు, చంద్రుడు కాలాతీత బంధానికి సూచిక‌. ఇలా ఇవ‌న్నీ ఇరు దేశాల మ‌ధ్య సాంస్కృతిక‌, ఆధ్యాత్మిక బంధాన్ని సూచిస్తాయి. కాగా, మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శ్రీలంకలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. థాయ్‌లాండ్ బిమ్‌స్టెక్ సదస్సు ముగిసిన అనంతరం శుక్రవారం సాయంత్ర ప్రధాని మోదీ శ్రీలంకకు చేరుకున్నారు. అక్కడి ఎయిర్‌పోర్టులో దిగిన ఆయనకు శ్రీలంక ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది.
శనివారం ఉదయం ఇండిపెండెన్స్ స్క్వేర్ వద్ద ఆ దేశ అధ్యక్షుడు సంప్రదాయ పద్ధుతుల్లో ఆహ్వానం పలికారు. అనంతరం ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ట్రింకోమలీని ఇంధన కేంద్రంగా అభివృద్ధి చేయడం.. శ్రీలంక తూర్పు ప్రాంతానికి భారత్ గ్రాంట్ అందించడం వంటి ఒప్పందాలు జరిగాయి. మరోవైపు తమిళ జాలర్లను వెంటనే విడుదల చేయాలని.. అలాగే వారి పడవలను విడిచిపెట్టాలని ప్రధాని మోదీ ఈ సందర్భంగా శ్రీలంకను కోరారు. కాగా రెండు దేశాల మధ్య ఎన్నో ఏళ్లుగా ఈ అంశం నలుగుతోంది. తాజాగా మరోసారి ఈ అంశంపై ప్రధాని మోదీ చర్చించడం ప్రాధన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే కచ్ఛతీవు వద్ద రాష్ట్ర జాలర్లు చేపలు పట్టేందుకు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్టాలిన్ ఇటీవల ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
RELATED ARTICLES

Most Popular

Recent Comments