Homemain slidesమీకు హిందీ వచ్చా అని బ్రిటిషోళ్లను ఆపమా?

మీకు హిందీ వచ్చా అని బ్రిటిషోళ్లను ఆపమా?

భారత్ సమాచార్, సినీ టాక్స్ : రాజ్ కుమార్ హిరానీ.. భారతీయ చిత్ర పరిశ్రమలో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్. ఈయన డైరెక్షన్ లోనే మున్నాభాయ్ ఎంబీబీఎస్, మున్నాభాయ్ జిందాబాద్, త్రి ఇడియట్స్, పీకే, సంజు లాంటి ఆల్ టైం సూపర్ హిట్ చిత్రాలు వచ్చి ప్రేక్షకుల్ని విపరీతంగా మెప్పించాయి. హ్యుమర్, హ్యూమన్ ఎమోషన్స్ ను తెరకెక్కించడంలో హిరానీ తనకు తానే సాటి. వీటితో పాటు సెన్సెటివ్ సోషల్ ఇష్యూస్, హ్యుమన్ వాల్యూస్ ను బాగా చూపిస్తారు. మంచి కథ అద్భుతంగా తెరకెక్కిస్తే అదే కమర్షియల్ హిట్ అవుతుందని నిరూపించే దర్శకుల్లో హిరానీ ప్రథముడు. తాజాగా ఆయన డైరెక్షన్ లో షారుఖ్ హీరోగా వస్తున్న ‘డంకీ’ మూవీ ట్రైలర్ ను మంగళవారం రిలీజ్ చేశారు. పఠాన్, జవాన్ చిత్రాల తర్వాత షారుఖ్ హీరోగా వస్తున్న డంకీపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ట్రైలర్ ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది.

ఇంగ్లిష్ నేర్చుకుని ఎలాగైనా యూకే వెళ్లి సెటిల్ అవ్వాలనుకునే గ్రామీణ యువకుడి పాత్రలో షారుఖ్ నటన ఆకట్టుకుంది. తను జంటగా తాప్సీ కనిపించనుంది. విక్కీ కౌశల్ కీలకపాత్ర పోషించాడు. కథలోకి వెళ్తే.. ఇంగ్లిష్ రాకపోవడంతో ఐదుగురు ఫ్రెండ్స్ వీసాలు రిజెక్ట్ అవుతాయి. దీంతో అక్రమంగా యూకే వెళ్లే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయాణంలో వీళ్లంతా ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అనేది మెయిన్ కాన్సెప్ట్. మూడు నిమిషాల ట్రైలర్ లో కథ ఏమిటో క్లియర్ గా రివీల్ చేశారు. ‘డంకీ’ అనగా మరో దేశంలోకి చొరబడడం అని అర్థం. సరదా సీన్స్ తో మొదలైన ట్రైలర్, ఆ తర్వాత ఎమోషనల్ గా టర్న్ అయ్యింది. ‘‘బ్రిటీష్ వాళ్లు మన దేశానికి వచ్చినప్పుడు మనం హిందీ వచ్చా అని అపలేదు. కానీ మనల్ని ఆపానికి వాళ్లకెంతా ధైర్యం’’ అంటూ షారుఖ్ ప్రశ్నించే డైలాగ్ ట్రైలర్ కే హైలెట్ గా నిలిచింది. ఈ మూవీ డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

మరికొన్ని కథనాలు…

బాలీవుడ్ లో తారక్ సరసన ఈ ముద్దుగుమ్మే!

RELATED ARTICLES

Most Popular

Recent Comments