Homemain slides‘సుందరకాండ’ మూవీ టీజర్ రిలీజ్

‘సుందరకాండ’ మూవీ టీజర్ రిలీజ్

భారత్ సమాచార్, సినీ టాక్స్ ;

టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చినట్టు నారా రోహిత్ కూడా వెండితెరపై ఫామ్ లోకి వచ్చాడు. గత ఎన్నికల సందర్భంలో ‘ప్రతినిధి 2’ సినిమాతో సినీ ప్రేక్షకులకు కనిపించాడు రోహిత్. అంతకు ముందు ఐదేళ్లు వెండితెరపై కనిపించనే లేదు.ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. తాజాగా ‘సుందరకాండ’ మూవీతో సినీ ప్రేమికుల ముందుకు రానున్నాడు. నేడు ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ సారి కామెడీ సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పెళ్లి కానీ ప్రసాద్ తరహా హాస్యాన్ని అందించనున్నాడు. టీజర్ ఆసాంతం కథానాయకుడి పరిచయం, అతడి పెళ్లి కష్టాలు, డిమాండ్స్ ని చెబుతూనే కామెడీగా సాగింది. ‘సుందరకాండ’ సిద్ధార్థ్ తన పెళ్లి కష్టాలు, డిమాండ్స్ తో ప్రేక్షకుల్ని మెప్పిస్తాడో లేదో తెలియాలంటే మరి కొంత కాలం ఎదురు చూడాలి. సంతోష్ ఈ సినిమాకి దర్శకుడు. టీజర్ లో జేమ్స్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది.

మరికొన్ని సినీ సంగతులు…

‘క’ మూవీ టీజర్ విడుదల

RELATED ARTICLES

Most Popular

Recent Comments